భారతదేశం, మే 18 -- Rashmika Mandanna: సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె షాహిద్ కపూర్, కృతి సనన్ లతో కలిసి నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ సీక్వెల్ ప్రాజెక్ట్ 'కాక్‌టెయిల్-2'. హోమి అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముంబైలో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ముంబైలో ఏర్పాటు చేసిన 'కాక్‌టెయిల్-2' మ్యూజికల్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ అంతా హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో రష్మిక మందన్న ఒక అసౌకర్యమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా హీరో షాహిద్ కపూర్, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి మీడియా కెమెరాలకు పోజులు ఇస్తున్నారు. ఆ సమయంలో ష...