భారతదేశం, ఏప్రిల్ 5 -- దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తన నటనతో, చిలిపి నవ్వుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 5). ఆమె 30వ పుట్టినరోజు జరుపుకొంటోంది. ఈ ఏడాది ఆమె పుట్టినరోజు మరింత ప్రత్యేకం. నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత ఆమె జరుపుకుంటున్న మొదటి బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

రష్మిక మందన్న బాక్సాఫీస్ క్వీన్ గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా కరోనా పాండమిక్ తర్వాత రష్మిక జోరు మామూలుగా లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్‌గా రష్మిక రికార్డు సృష్టించింది. రష్మిక నటించిన గత అయిదు సినిమాల నుంచి ఏకంగా రూ.2,070 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

'పుష్ప 2: ది రూల్', 'సికందర్', 'ఛావా', 'యానిమల్' వంటి సినిమాలతో రష్మిక మందన్న పేరు...