భారతదేశం, ఏప్రిల్ 9 -- Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును (ఏప్రిల్ 5) చాలా ప్రత్యేకంగా జరుపుకుంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ నేషనల్ క్రష్.. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో తన సొంత ఊరిలో, ఆత్మీయుల మధ్య గడిపింది. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండే రష్మిక.. ఈ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి తన సొంత ఊరికి వెళ్లింది. ఈసారి ఆమె వెంట భర్త విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు.

"నా 30వ పుట్టినరోజు ఈసారి చాలా భిన్నంగా జరిగింది. చాలా కాలం తర్వాత ఇంటికి వెళ్లాను. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాను" అని రష్మిక పేర్కొంది.

సమయం తక్కువగా ఉన్నప్పటికీ తాను చదువు...