భారతదేశం, మార్చి 9 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ల గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. తాజాగా రష్మిక ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తన గురించి ఎవరో రాసిన ఒక ఆర్టికల్ చదివి తను ఎంతలా భావోద్వేగానికి గురైందో వివరిస్తూ, తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

చాలా కాలం తర్వాత తన గురించి రాసిన ఒక విషయం చదివి తను ఇంతలా ఎమోషనల్ అవ్వడం బహుశా ఇదే తొలిసారి అని రష్మిక మందన్న రాసుకొచ్చింది.

"చెప్పాలని నా మనసులో చాలా ఉంది.. కానీ నేను బయటపెట్టగలిగేది చాలా తక్కువే. నేను నాకంటూ ఒక సొంత స్పేస్ వెతుక్కుంటున్నాను.. నేను చేస్తున్న ఈ ప్రయాణం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. నా ఈ జర్నీని గుర్తించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని చెప్పింది.

ఈ పో...