భారతదేశం, జూన్ 13 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటి ప్రభావం 12 రాశుల వారిపై పడుతుంది దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని గ్రహాల సంచారంలో మార్పు వలన మంచి ఫలితాలు కనపడితే ఒక్కోసారి అశుభ ఫలితాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జూన్ నెల గ్రహాల సంచారంలో కీలక మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెల 15న సూర్యుడు తన రాశిని మార్చి, మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే మిథునంలో బుధుడు, చంద్రుడు ఉండటంతో, సూర్యుడి రాకతో అరుదైన 'త్రిగ్రాహి రాజయోగం' ఏర్పడనుంది. ఈ అద్భుతమైన ఖగోళ కలయిక జూన్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ఆర్థిక, వృత్తిపరమైన లాభాలు చేకూరనున్నాయి.

ఈ రాజయోగం మీ సొంత రాశిలోనే ఏర్పడుతుండటంతో, గరిష్ట ప...