భారతదేశం, ఏప్రిల్ 18 -- Rare Alignment of four planets: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులను తీసుకు వస్తుంది. ఈ రోజు రాత్రి 4 గ్రహాల వలన విశేషమైన ధన యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతోంది. కుజుడు, బుధుడు, శని, నెప్ట్యూన్ ఒకే వరుసలో ఉంటాయి. ఈ అరుదైన దృశ్యం ఈ రోజు జరగబోతోంది. ఇది పన్నెండు రాశుల జీవితంపై ప్రభావం చూపించడమే కాకుండా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.

ఈ నాలుగు గ్రహాలు ఒకే వరుసలో (Rare Alignment of four planets) ఉంటాయి. దీనితో ప్రత్యేకమైన ధనయోగం ఏర్పడుతోంది. ఇది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఇది నాలుగు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకువస్తుంది. మరి ఈ సమయంలో ఏ రాశులకు బాగుంటుంది? ఎవరికి ఎ...