భారతదేశం, జూన్ 27 -- Rao Bahadur: టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ 'రావు బహదూర్' (Rao Bahadur) జులై 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి కల్ట్ క్లాసిక్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ గా సపోర్ట్ అందిస్తూ ప్రమోషన్స్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రీసెంట్‌గా రిలీజైన టీజర్, పోస్టర్స్ ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్ జనరేట్ చేశాయి.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకటేష్ మహా.. రావు బహదూర్ ఏ జోనర్‌లో ఉండబ...