భారతదేశం, అక్టోబర్ 26 -- Rana Daggubati: పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2013లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన 'యే జవానీ హై దీవానీ' హిందీ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ యే జవానీ హై దీవానీ చిత్రంలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనె జంటగా నటించారు. మ్యూజికల్ గా, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమాలో రానా ఓ చిన్న క్యామియో (అతిథి పాత్ర)లో కనిపించి సందడి చేశారు. తాజాగా ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో జరిగిన 'ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ (IFP 2026)' ఈవెంట్ లో పాల్గొన్న రానా.. ఈ సినిమాలో తన ఎంట్రీ వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను అభిమానులతో ప...