భారతదేశం, నవంబర్ 14 -- Ramayana Records: రామాయణం మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా 9 రోజుల్లోనే కల్కి, పఠాన్ లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ రూ.1100 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది.

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) రిపోర్టు ప్రకారం.. రెండో శుక్రవారం (నవంబర్ 13 - 9వ రోజు) 'రామాయణం' చిత్రం భారత్‌లో రూ. 47.85 కోట్ల నెట్ (రూ. 57.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. గురువారం నాటి రూ. 53.50 కోట్లతో పోలిస్తే ఐదు భాషల్లో కలిపి కేవలం 10.6 శాతం స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైంది. విదేశాల్లో 9వ రోజు మరో రూ. 25 కోట్లు రాబట్టింది.

హిందీ: 18,377 షోలలో 29.9% ఆక్యుపెన్సీతో రూ. 36.25 కోట్ల నెట్ వసూలు చేసింది (దేశీయ వసూళ్లలో 75.8% వాటా).

మలయాళం: కేవలం 1,070 షోలలోనే ఏకంగా 60.1% అత్యధిక ఆక్యుపెన...