భారతదేశం, అక్టోబర్ 28 -- Ramayana First Review: భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్ వండర్ 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'. తాజాగా లాస్ ఏంజిల్స్ లో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ ప్రీమియర్ ఘనంగా జరిగింది. ఈ షో చూసిన ఒక అంతర్జాతీయ క్రిటిక్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.

2001లో వచ్చిన హాలీవుడ్ ఎపిక్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' చూసినప్పుడు తనకు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో.. ఇప్పుడు 'రామాయణం' చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని ఆ క్రిటిక్ చెప్పాడు. రాముడి పాత్రను చూపించిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఇక పార్ట్ 2కు లీడ్ ఇస్తూ వచ్చే ముగింపు సీన్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని, స్క్రీన్ బ్లాక్ అవ్వగానే తాను ఆశ్చర్యంతో గట్టిగా అరిచేశానని తెలిపాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్ విష...