భారతదేశం, నవంబర్ 13 -- Ramayana Collection Records: మన దేశంలో రామాయణానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ ఇతిహాస చిత్రం దానికి తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులను క్యాష్ చేసుకున్న ఈ మూవీ.. మొదటి 8 రోజుల్లోనే రూ.1000 కోట్ల (గ్రాస్) క్లబ్‌లో చేరింది.

రామాయణం కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.. ఆసియాలోని దాదాపు 300కు పైగా ప్రాంతీయ వర్షన్లలో ఈ ఇతిహాసం ప్రాచుర్యంలో ఉంది. ఇండోనేషియాలో కకావిన్ రామాయణ, బాలినీస్ రామకవచ తదితర పేర్లతో శతాబ్దాలుగా రామాయణం వారి సంస్కృతిలో భాగమైంది. అందుకే అక్కడ రామాయణం మూవీ ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా లక్ష డాలర్లు (సుమారు రూ.1 కోటి) వసూలు చేసి, ఇండోనేషియాలో ఒక ఇండియన్ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది.

అలాగే థాయ్‌లా...