భారతదేశం, ఏప్రిల్ 17 -- Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తుంటాడు. ఇన్ని రోజులూ ధురంధర్ 2ను ఆహా అంటూ పొగిడేసిన అతను.. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నెగెటివ్ కామెంట్లు చేశాడు. ఒక విషయంలో మాత్రం మూవీని అపోజ్ చేశాడు. సినిమాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రను చిత్రించిన తీరు సరిగ్గా లేదని వర్మ అభిప్రాయపడ్డాడు.

ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీతో నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలో ఆర్జీవీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ధురంధర్ 2 మేకింగ్, క్రాఫ్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ, దావూద్ ఇబ్రహీం పాత్ర విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పాడు. సినిమాలో దావూద్‌ను 'బడే సాహబ్' అని పిలుస్తూ, పాకిస్థాన్‌తో కలిసి భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలను నడిపించే కీలక వ్యక్తిగా చూపించారు.

" ధురంధర్ 2 సినిమాలో నాకు నచ్చని అంశం ఏదైనా ఉందం...