భారతదేశం, ఏప్రిల్ 22 -- Ram Charan Vaazha 2: మలయాళ చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై, వసూళ్ల సునామీ సృష్టించిన 'వాలా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' (Vaazha 2) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ మూవీ చరిత్ర సృష్టించింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగులో ప్రముఖ నిర్మాత సాహు గారపాటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తన 16వ మూవీ 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో చరణ్ ఎప్పుడూ...