భారతదేశం, సెప్టెంబర్ 4 -- Ram Charan Janmashtami: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. తమ ముగ్గురు పిల్లలతో కలిసి చరణ్-ఉపాసన దంపతులు ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో ఈ పూజలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో బుల్లి పిల్లలను శ్రీకృష్ణుడు, రాధారాణి గెటప్పుల్లో అలంకరించడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లోని దేవుడి మందిరంలో సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు భక్తిపారవశ్యంలో మునిగిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

తమ ఇంట్లో పిల్లలతో కలిసి పూజ చేస్తున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. "కల నిజమైంది.. ఆనందంగా ఉంది.. ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే క్యాప్షన్ తో ఉపాసన ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మొదటి సంతానంగా కుమార్తె ...