భారతదేశం, ఏప్రిల్ 14 -- Ram Charan Dacoit Review: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సత్తా చాటిన ఈ మూవీపై ఇప్పుడు సెలబ్రిటీల ప్రశంసలు మొదలయ్యాయి. తాజాగా 'గ్లోబల్ స్టార్' రామ్ చరణ్ ఈ సినిమాను చూసి, మూవీ టీమ్ ను అభినందిస్తూ ఎక్స్‌ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

డెకాయిట్ సినిమాలో నటీనటుల ప్రతిభను రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "డెకాయిట్ సినిమా చూశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ తన నటనతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. శేష్ నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇక మృణాల్ ఠాకూర్ తన పాత్రకు ప్రాణం పోశారు. ఆమె నటనలో ఉన్న డెప్త్ సినిమాకు పెద్ద అసెట్" అని చరణ్...