భారతదేశం, మే 30 -- Ram Charan Bodyguard: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పెద్ది' దేశవ్యాప్త ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ టూర్ లో చరణ్ రగ్గడ్ లుక్ ఒకవైపు ట్రెండ్ అవుతుంటే, ఆయనతో పాటు నీడలా నడుస్తున్న బాడీగార్డ్ కూడా వైరల్ గా మారాడు. నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త బాడీగార్డ్ గురించే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

రామ్ చరణ్ బాడీగార్డ్ గురించి షాక్ అవుతారు. అవును.. అతను మామూలోడు కాదు. అతని పేరు కెవిన్ కుంటా. అతనో ఎంఎంఏ ఫైటర్. ఆఫ్రికన్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అతను. ఇటలీ ఎంఎంఏ బెల్ట్ కూడా సాధించాడు. ఇక అతనికి రోజుకు రామ్ చరణ్ లక్షల్లో జీతం ఇస్తున్నాడనే వార్తలు వైరల్ గా మారాయి.

రిపబ్లిక్ మీడియా కథనం ప్రకారం, పబ్లిక్ ఈవెంట్స్, ప్రమోషన్ల సమయంలో రామ్ చరణ్ రక్షణ కోసం కెవిన్ కుంటాకు రోజుకు రూ. 2 లక్షల నుంచ...