భారతదేశం, జూలై 28 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని ప్రముఖ గంగ హాస్పిటల్‌లో విజయవంతంగా సర్జరీ పూర్తి చేసుకున్నారు. సర్జరీ పూర్తయిన వెంటనే వైద్యుల బృందంతో కలిసి ఆయన చిరునవ్వుతో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వైద్య ప్రక్రియను గంగ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ S. రాజశేఖరన్ నేతృత్వంలో విదేశీ నిపుణులు డాక్టర్ అలెక్సాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ బృందం చాలా సక్సెస్ ఫుల్‌గా నిర్వహించారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, ఆయన చాలా వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు అఫీషియల్‌గా వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూరులోనే కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

చరణ్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి,...