భారతదేశం, జూలై 26 -- Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు సర్జరీ జరగబోతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన భారీ చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు తీవ్రమైన గాయమైన సంగతి తెలిసిందే. అప్పుడు సినిమా షూటింగ్, ప్రమోషన్స్ కారణంగా సర్జరీ వాయిదా వేసుకున్నాడు. ఈ సర్జరీని రేపు (జూలై 27) నిర్వహించనున్నట్లు తెలిసింది.

రామ్ చరణ్ గాయానికి వైద్యులు వెంటనే విశ్రాంతి, శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయినా పెద్ది సినిమా చిత్రీకరణ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా సినిమా ప్రమోషన్లలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు రామ్ చరణ్. ఇప్పుడు పెద్ది బాక్సాఫీస్ ప్రయాణం ముగియడంతో తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాడు.

తమిళనాడులోని కోయంబత్తూర్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన 'గంగా ఆసుపత్...