భారతదేశం, మే 18 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన పెద్ది మూవీ ట్రైలర్ సోమవారం (మే 18) రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో ఓ క్రికెటర్, రెజ్లర్, రన్నర్ పాత్రల్లో కనిపించిన చరణ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతుండగా.. అతని చేతికి తగిలిన గాయం గురించి అభిమానులు అడిగారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. "నా చేయి బాగానే ఉంది. ఇది బుచ్చిబాబు ఇచ్చిన చిన్న గిఫ్ట్. చివరి 25, 30 రోజులుగా కుస్తీ షూటింగ్ చేస్తున్నాం. పెహల్వాన్ లు షూటింగ్ సమయంలో చాలా గట్టిగా చేయి పట్టుకున్నారు. దీంతో కాస్త గాయమైంది. ఇది పెద్ది ఇచ్చిన ఓ మరుపురాని జ్ఙాపకం" అని చరణ్ అనడం విశేషం.

ఇక పెద్ది సినిమా కోసం తాను చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి కూడా చరణ్ స్పందించాడు....