భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో చెప్పే వార్త ఇది. అతను హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'పెద్ది'. ఇదో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. అయితే ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ కు రికార్డు రేటు పలికిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కానుంది. దీంతో మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 7 మిలియన్ డాలర్లు పలికాయని ట్రేడ్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం. చెర్రీ కెరీర్ లోనే ఇది రికార్డు.

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టింది. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా ర...