భారతదేశం, జూన్ 2 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ మాస్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదల కోసం సిద్ధమవుతూ, ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన కేవలం సినిమా విశేషాలే కాకుండా, తన పర్సనల్ లైఫ్, తండ్రిగా తన ప్రయాణం గురించి చాలా సరదాగా, ఓపెన్‌గా మాట్లాడారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక కుమార్తె (క్లిన్ కారా), అలాగే ఇటీవలే (జనవరి 2026లో) జన్మించిన కవలలు (ఒక బాబు, ఒక పాప) ఉన్న సంగతి తెలిసిందే. ముగ్గురు పిల్లల తండ్రిగా తన బాధ్యతల గురించి చరణ్ మాట్లాడారు.

"నేను మంచి తండ్రినా లేక సాధారణ తండ్రినా అనేది నాకు తెలియదు. కానీ పిల్లల పెంపకంలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాను. వాళ్లకు అన్నం తినిపించడం, నిద్రపుచ్చడం అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. క్లిన్ కారా దాదాపు ప్రతి రాత్రి నా...