భారతదేశం, జూన్ 2 -- Ram Charan: గత కొన్ని రోజులుగా దేశాన్ని 'పెద్ది' మూవీ మేనియా ఓ తుపానులా తాకుతోంది. ఎక్కడ చూసినా పెద్ది పేరు మాత్రమే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఇదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ జోష్ ను మరింత పెంచేలా సోమవారం (జూన్ 1) రాత్రి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ స్పీచ్ వైరల్ గా మారింది.

పెద్ది రోర్ పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ చాలా కాన్పిడెంట్ గా మాట్లాడాడు. విజయవాడలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కు తరలివచ్చిన జనసందోహాన్ని, వారి ఉత్సాహాన్ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. "ఇది సినిమా రిలీజ్‌కు ముందు జరుగుతున్న వేడుకలా లేదు, సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత జరుపుకునే సక్సెస్ మీట్‌లా కనిపిస్తోంది" అని చరణ్ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా విజయవాడ నగరంతో తన కుటుంబానికి ఉన్న ఎమోషనల్ అనుబంధా...