భారతదేశం, అక్టోబర్ 16 -- Ram Charan: డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. 1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.

సోనీ మాక్స్ (Sony MAX) ఛానెల్‌లో అక్టోబర్ 24 రాత్రి 8 గంటలకు హిందీలో ప్రసారం కానున్న సందర్భంగా, రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ విశేషాలను, తనకు బాగా కనెక్ట్ అయిన సీన్ల గురించి మీడియాతో పంచుకున్నారు.

పెద్ది సినిమాలోని కీలక సన్నివేశాల గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. "సినిమాలో కేవలం ఒక...