భారతదేశం, మార్చి 5 -- రజనీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు తిరగరాసిందో మనకు తెలుసు. 2023లో వచ్చిన ఈ 'జైలర్' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాలో ఇప్పటికే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ తారలు భాగం కాగా.. ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ కొలాబరేషన్ జరగబోతోందని సమాచారం. షారుక్ ఖాన్ ఈ సినిమాలో ఒక కీలకమైన క్యామియో రోల్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్టైలిస్ట్ జిషాద్ షంసుద్దీన్ షేర్ చేసిన ఒక ఏఐ (AI) ఫోటో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఆ ఫోటోలో షారుక్ ఖాన్ కారు నడుపుతుండగా, పక్కన మోహన్ లాల్.. వెనుక సీట్లో రజనీకాంత్, శివరాజ్ కుమార్ కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ జిషాద్ "కచ్చితంగా ఉంటుంది (Kandippa irukkum)" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో షారుక...