భారతదేశం, మే 17 -- Rajinikanth: తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు నడిచాయి. ఈ ఫలితాల పట్ల రజినీకాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు, పార్టీల విలీనం కోసం ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు ప్రచారం చేశారు. వీటిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఊహాగానాలకు, తప్పుడు ప్రచారాలకు రజినీకాంత్ ఆదివారం ఉదయం చెన్నై పోయెస్ గార్డెన్‌ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ లో తలైవా గట్టి సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులను తిప్పికొట్టడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు రజినీకాంత్ ప్రకటించారు.

"నాపై వస్తున్న రూమర్లకు నేను స్పందించకపోతే, సమాజం వాటినే నిజాలుగా నమ్మే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు మాట్లా...