భారతదేశం, ఏప్రిల్ 4 -- సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు స్వయంగా రజనీకాంత్ వెల్లడించారు. శనివారం చెన్నై విమానాశ్రయంలో కనిపించిన ఆయన మీడియాతో ముచ్చటించారు.

సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న తలైవా రజినీకాంత్.. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రజినీకాంత్‌కు రిపోర్టర్లు ఘన స్వాగతం పలికారు. వారిని చూసి నవ్వుతూ పలకరించిన ఆయన, విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఓపిగ్గా బదులిచ్చారు.

"జైలర్ 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. సినిమా విడుదల తేదీన...