భారతదేశం, ఏప్రిల్ 28 -- Rajeev Kanakala: రాజీవ్ కనకాల ప్లే చేసిన క్యారెక్టర్ చస్తే సినిమా హిట్.. ఇదీ ఇన్ని రోజులూ టాలీవుడ్ లో సరదాగా వినిపించిన మాట. కానీ ఇప్పుడా ట్రెండ్ మారిందని, ఆయన బతికి ఉంటే మూవీస్ హిట్ అవుతున్నాయని తాజాగా కమెడియన్ సుదర్శన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. గోదారి గట్టుపైన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సుదర్శన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

గోదారి గట్టుపైన మూవీ ట్రైలర్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో కమెడియన్ సుదర్శన్ మాట్లాడాడు. మధ్యలో రాజీవ్ కనకాల గురించి కూడా చెప్పాడు. ఆ సమయంలోనే యాంకర్ స్రవంతి చొక్కారపు వచ్చి రాజీవ్ గురించి అడిగింది. ఈ సినిమాలో ఆయన బతికే ఉంటారా? అని ప్రశ్నించింది.

స్రవంతి ప్రశ్నకు సుదర్శన్ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. ''ఇప్పుడు ట్రెండ్ మారింది'' అని సుదర్శన్ చెప్పాడు. ఏమో డైరెక్టర్ మళ్లీ చంపేశారేమోనని స్...