భారతదేశం, మే 4 -- Rajasekhar: యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్లతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. మూవీస్ లో కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా బైకర్ మూవీలో హీరో తండ్రిగా అదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన పెళ్లి, సినిమాల గురించి చెప్పుకొచ్చారు.

జీవితను రాజశేఖర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రాజశేఖర్ తన పెళ్లికి ముందు జరిగిన సంగతులను గుర్తు చేసుకున్నారు. అప్పుడు హీరోయిన్ శ్రీదేవి సంబంధం కూడా వచ్చిందని, ఇంట్లోవాళ్లు ఆమెను పెళ్లి చేసుకోమన్నారని రాజశేఖర్ పేర్కొన్నారు.

''జీవిత నాకు ప్రపోజ్ చేసేలా చేశా. ఇంట్లో జీవిత విషయం చెప్పా. కానీ మా అమ్మ నాకు మరో సంబంధం చూసింది. ఆ అమ్మాయిత...