భారతదేశం, మార్చి 2 -- గ్లోబల్ స్టార్ ప్రియంక చోప్రా తన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ 'ది బ్లఫ్'తో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ చూస్తే ఆమె టాలెంట్ ఏంటో తెలుస్తుందని అనడం విశేషం.

ప్రియాంక చోప్రా నటనలోని వైవిధ్యాన్ని కొనియాడుతూ రాజమౌళి ఎక్స్ లో ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. "ఒకే సమయంలో రెండు భిన్నమైన భావోద్వేగాలను పండించగల అతికొద్ది మంది నటుల్లో ప్రియాంక ఒకరు. ఆమె ఒక క్షణంలో ఎంతో సున్నితంగా కనిపిస్తూనే, మరుక్షణంలో ఎంతో శక్తివంతంగా మారిపోగలరు. 'ది బ్లఫ్' సినిమా ఆమెలోని ఈ అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. ఇందులో ఆమె చేసిన ప్రమాదకరమైన స్టంట్లు అద్భుతం" అని రాజమౌళి పేర్కొన్నాడు. అ...