భారతదేశం, అక్టోబర్ 24 -- Rajamouli: లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న 'వారణాసి' (Varanasi) గురించి జక్కన్న క్రేజీ సీక్రెట్ చెప్పారు. రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంపై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక '50వ సావోపాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' (Mostra de São Paulo)కు రాజమౌళి హాజరయ్యారు. అక్కడ అవార్డు కూడా అందుకున్నారు. అదే వేదికపై వారణాసి మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను జక్కన్న వెల్లడించారు. బ్రెజిల్ దేశానికి రాజమౌళి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ ఫెస్టివల్‌లో ప్రేక్షకులతో ముచ్చటించిన రాజమౌళి.. 'వారణాసి' చిత్రం స్కేల్ పరంగా ...