భారతదేశం, మార్చి 30 -- పాపులర్ బెంగాలీ యాక్టర్ రాహుల్ అరుణోదయ్ బెనర్జీ ఇక లేరు అనే వార్త ఇండస్ట్రీలో అందరినీ కలిచివేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం తలసరి బీచ్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదం తర్వాత తమ్లూక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అతని పోస్ట్‌మార్టం పూర్తయింది. భోలే బాబా పార్ కరేగా అనే టీవీ సీరియల్ షూటింగ్ చేస్తూ రాహుల్ తన కో స్టార్ శ్వేతా మిశ్రాతో కలిసి సముద్రం నీళ్లలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ షూటింగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఆ వీడియోలో రాహుల్ బెనర్జీ, శ్వేతా మిశ్రా రోడ్డు మీద నిలబడి కనిపిస్తున్నారు. ఒక సీన్ మధ్యలో వాళ్ల చుట్టూ క్రూ మెంబర్స్ అంతా ఉన్నారు. ఆ టైమ్‌లో రాహుల్ గ్రీన్ షర్ట్ వేసుకోగా, శ్వేతా మిశ్రా పింక్ చీరలో ఉంది.

ఏబీపీ ఆనంద ర...