భారతదేశం, మార్చి 14 -- రాశీ ఖన్నా.. తెలుగు సినీ లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు ఇది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటించిన రాశీ ఖన్నా ఈ సినిమాలో గ్లామర్ రోల్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రమోషన్లలో రాశీ ఖన్నా బిజీగా ఉంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ లో గ్లామర్ షోపై షాకింగ్ కామెంట్లు చేసింది. పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుందని డైరెక్టర్ హరీష్ శంకరే చెప్పాడని వెల్లడించింది.

''సినిమాలో హీరోకు ఎలివేషన్ ఎలా ఇవ్వాలి? గ్లామర్ ఎలా చూపించాలి? అనేది డైరెక్టర్ హరీష్ శంకర్ కు తెలుసు. ఈ మూవీలో గ్లామర్ క...