భారతదేశం, ఏప్రిల్ 9 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. అయితే ఈ ఏడాది వచ్చిన 'రాకా' (Raaka) మూవీ అనౌన్స్‌మెంట్ బన్నీ బర్త్‌డే ను మరింత స్పెషల్ గా మార్చింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ లుక్ పై రియాక్టయ్యాడు.

అట్లీ దర్శకత్వంలో 'జవాన్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న షారుఖ్ ఖాన్, తాజాగా విడుదలైన 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్.. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అచ్చం నీలాగే అద్భుతంగా ఉంది. మీరిద్దరూ కలిసి ఏం మ్యాజిక్ చేశారో చూడాలని ఆత్రుతగా ఉంది. అట్లీ మాటల్లో చెప్పాలంటే...