భారతదేశం, మే 13 -- జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు చాలామంది నిరాశకు లోనవుతారు. అటువంటి సమయాల్లో మనల్ని మనం ఉత్సాహపరుచుకోవడానికి, తిరిగి పుంజుకోవడానికి గొప్ప వ్యక్తుల మాటలు ఎంతో తోడ్పడతాయి. కేవలం తత్వవేత్తలు, రచయితలే కాదు.. క్రీడాకారులు కూడా తమ జీవితానుభవాల నుంచి అద్భుతమైన పాఠాలను నేర్పుతుంటారు. అమెరికన్ ఫుట్‌బాల్ దిగ్గజం టోనీ డోర్సెట్ చెప్పిన మాటలు నేడు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి.

"విజయం సాధించాలంటే.. మీరు గట్టిగా పట్టుకోగలిగే ఒక లక్ష్యం, మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపించే ఒక ప్రేరణ, మీలో ఉత్సాహాన్ని నింపే ఒక స్ఫూర్తిని మీరు వెతుక్కోవాలి" అని టోనీ డోర్సెట్ పేర్కొన్నారు.

ఈ మాటలు చాలా సరళంగా అనిపించినప్పటికీ, వీటి వెనుక లోతైన అర్థం దాగి ఉంది. కేవలం అదృష్టం మీదో, ప్రతిభ మీదో ఆధారపడి విజయం లభించదని.. పరాజయాలు ఎదురై...