భారతదేశం, ఏప్రిల్ 15 -- సాధారణంగా వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ, లాభనష్టాల లెక్కల్లో బిజీగా ఉండే కార్పొరేట్ దిగ్గజాలు సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలు చేయడం అరుదు. కానీ, రిలయన్స్ రిటైల్, జియో, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నాయకత్వ బాధ్యతల్లో ఉన్న ఇషా అంబానీ, రాబోయే తరం ఎదుర్కోబోయే విద్యా సవాళ్లపై స్పష్టమైన విజన్‌ను పంచుకున్నారు. వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారాయి.

సమాచార సేకరణలో తరాల మధ్య వచ్చిన మార్పును ఇషా అంబానీ చాలా ఆసక్తికరంగా వివరించారు. మన పూర్వీకుల నుంచి నేటి పిల్లల వరకు జ్ఞానాన్ని పొందే విధానం ఎలా మారిందో ఆమె మాటల్లోనే చూద్దాం.

"మా తల్లిదండ్రుల కాలంలో ఏదైనా సమాచారం కావాలంటే లైబ్రరీలకు వెళ్లేవారు. మా తరం వచ్చేసరికి ఇంటర్నెట్‌పై ఆధ...