భారతదేశం, జూన్ 12 -- "మీరు అనుకున్న లక్ష్యాల స్థాయికి మీరు ఎదగలేరు.. మీ రోజువారీ అలవాట్ల స్థాయికి మాత్రమే పడిపోతారు" అని ప్రముఖ రచయిత జేమ్స్ క్లియర్ పేర్కొన్నారు. కేవలం ఆశలు, ఆశయాలు మాత్రమే విజయాన్ని చేకూర్చలేవని చెప్పడానికి ఈ మాట ఒక చక్కని ఉదాహరణ.

లక్ష్యాలు మనకు ఒక సరైన దిశను చూపిస్తే.. రోజువారీగా మనం అనుసరించే పద్ధతులే మన గమ్యాన్ని డిసైడ్ చేస్తాయి. నిత్య జీవితంలో మెరుగైన అలవాట్లను నిర్మించుకోవడానికి, ఉత్పాదకతను పెంచుకోవడానికి, కెరీర్‌లో ఎదగడానికి లేదా చదువులో రాణించడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ జేమ్స్ క్లియర్ చెప్పిన ఈ సందేశం ఎంతో ఉపయోగపడుతుంది.

చాలామంది జీవితంలో ఎదగాలని రకరకాల గోల్స్ సెట్ చేసుకుంటారు. ఫిట్‌గా మారాలి, ఒక పుస్తకం రాయాలి, డబ్బు ఆదా చేయాలి, కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరాలి అనుకోవడం ఒక లక్ష్యం. అయితే, ఆ గోల్స్ పెట్టు...