భారతదేశం, ఏప్రిల్ 27 -- Quote of the Day: "అద్భుతంగా చెప్పడం కంటే, అద్భుతంగా చేసి చూపడమే మేలు" అని అమెరికా చరిత్రను మలుపు తిప్పిన మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు.

1737లో ఆయన ప్రచురించిన 'పూర్ రిచర్డ్స్ అల్మానాక్' (Poor Richard's Almanack) అనే పుస్తకంలో ఈ ప్రసిద్ధ వ్యాక్యం కనిపిస్తుంది. కేవలం మాటలతో ఎదుటివారిని మెప్పించడం సులభం, కానీ ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలితాలను సాధించడమే నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని ఫ్రాంక్లిన్ నమ్మేవారు. నేటి తరం రాజకీయాల నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఈ సూక్తి ప్రతి అడుగులోనూ మనకు స్ఫూర్తినిస్తుంది.

ప్రస్తుత రోజుల్లో మనం చాలామందిని చూస్తుంటాం. కేవలం ఆకర్షణీయమైన మాటలతో, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత, నిజమైన నైపుణ్యం లేకపోయినా కేవలం ప్రచారంత...