భారతదేశం, మే 26 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమందరం కోరుకునేది ఒకటే.. 'ప్రశాంతత'. అసలు ఒత్తిడి లేని, సమస్యలు లేని జీవితమే పరమావధి అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మానసిక నిపుణుడు, హోలోకాస్ట్ బాధితుడు విక్టర్ ఫ్రాంకిల్ దీనికి భిన్నమైన, లోతైన విశ్లేషణ చేశారు. ఆయన రాసిన 'మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్' (Man's Search for Meaning) పుస్తకంలోని ఒక అద్భుతమైన వాక్యం నేటి కాలానికి ఎంతో అవసరం.

"మనిషికి నిజంగా కావాల్సింది ఒత్తిడి లేని స్థితి కాదు.. తను ఎంచుకున్న ఒక గొప్ప లక్ష్యం కోసం నిరంతరం శ్రమించడం, పోరాడటం."

1905లో వియన్నాలో జన్మించిన విక్టర్ ఫ్రాంకిల్ ఒక న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల కాన్సెంట్రేషన్ క్యాంపులలో ఆయన నరకాన్ని చూశారు. తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు బలవుతున్నా, చావు అంచుల్లో ...