భారతదేశం, మే 29 -- ఆఫీసులో రాజకీయాలు, ట్రాఫిక్‌లో చిరాకులు, సోషల్ మీడియాలో అనవసర విమర్శలు.. ఇవన్నీ నేడు సగటు మనిషి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. మనకు నచ్చని మనుషులు ఎదురైనప్పుడు లేదా ఎవరైనా మనల్ని నొప్పించినప్పుడు మనం వెంటనే ఆవేశానికి లోనవుతుంటాం. అయితే, ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని అప్పుడే చెప్పారు. ఆయనే మార్కస్ ఆరేలియస్.

"ఈ రోజు నాకు కృతజ్ఞత లేనివారు, అసూయాపరులు, మోసగాళ్లు, కోపిష్టులు, స్వార్థపరులు ఎదురవుతారు. దీనికి నేను ముందుగానే సిద్ధంగా ఉండాలి" అని రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ తన డైరీలో రాసుకున్నారు.

ఆయన చెప్పిన ఈ మాటలు నిరాశావాదం కాదు, అదొక మానసిక యుద్ధతంత్రం. లోకమంతా మంచివాళ్లే ఉంటారని ఊహించుకోవడం వల్ల, ఎవరో ఒకరు తప్పుగా ప్రవర్తించినప్పుడు మనం షాక్‌కు గుర...