భారతదేశం, ఏప్రిల్ 29 -- Quote of the Day: గతంలోని చేదు జ్ఞాపకాలను, పాత బాధలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే అసలైన విజయం. మన మనస్సులో పేరుకుపోయిన ప్రతికూలతలను తొలగించుకున్నప్పుడే, కొత్త సంతోషాలకు చోటు దక్కుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో మనిషి పతనానికి దారితీసే 3 ప్రధాన కారణాలను వివరించారు.

మూర్ఖత్వం కష్టదాయకమైనది, యవ్వనం కూడా కష్టాలతో కూడుకున్నది. కానీ వీటన్నిటికంటే అత్యంత బాధాకరమైనది 'పరాయి ఇంటిపై ఆధారపడి జీవించడం'. ఈ ఒక్క శ్లోకంలో మనిషి తన జీవితంలో చేయకూడని అతిపెద్ద తప్పులను చాణక్యుడు విశ్లేషించారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మూర్ఖత్వం అనేది ఒక వ్యక్తికి ఎదురయ్యే అతిపెద్ద కష్టం. ఇక్కడ మూర్ఖత్వం అంటే చదువు లేకపోవడం కాదు, కనీస అవగాహన లేకపోవడం. మూర్ఖుడు ఒకే తప్పును మళ్...