Quote of the Day: ఒంటరిగా గెలవడం కాదు.. అందరినీ గెలిపించడమే అసలైన విజయం: బుకర్ టి. వాషింగ్టన్ స్ఫూర్తిదాయక సందేశం
భారతదేశం, ఏప్రిల్ 23 -- విజయం అంటే కేవలం మనం ఎంత సంపాదించాం లేదా ఏ హోదాలో ఉన్నాం అనేది మాత్రమే కాదు. మన ఎదుగుదలలో ఎంతమందికి తోడుగా నిలిచాం అనేది కూడా ముఖ్యమే. "మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని భావిస్తే.. ముందుగా మీ పక్కన ఉన్న వారిని పైకి లేపండి" అని బుకర్ టి. వాషింగ్టన్ దశాబ్దాల క్రితమే చెప్పారు. ఈ మాటల్లోని లోతైన అర్థం నేటి డిజిటల్ యుగానికి కూడా అతికినట్టు సరిపోతుంది. స్వార్థంతో ఎదిగే వారు తాత్కాలిక విజయాలను అందుకోవచ్చు కానీ, అందరినీ కలుపుకొని వెళ్లేవారే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
చాలామంది ఇతరులకు సహాయం చేయడం అంటే తమ శక్తిని లేదా సమయాన్ని వృధా చేసుకోవడం అని భావిస్తారు. కానీ వాషింగ్టన్ సిద్ధాంతం ప్రకారం, ఇతరులకు చేయూతనివ్వడం అనేది మన వ్యక్తిత్వ వికాసానికి ఒక మార్గం. మనం ఒకరికి మెంటార్ (మార్గదర్శి)గా ఉన్నప్పుడు లేదా ఎవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.