భారతదేశం, ఏప్రిల్ 16 -- ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఒక వింత ధోరణి కనిపిస్తోంది. ఎవరైనా ఏదైనా విషయంలో అమితమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే, వెంటనే దానిని 'క్రింజ్' (Cringe) అని ముద్ర వేస్తున్నారు. ఏదైనా మంచి పని చేసినా.. అది కేవలం ఎదుటివారికి కనిపించడం కోసమే చేస్తున్నారని ('Performative') ఎద్దేవా చేయడం ఫ్యాషన్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ పాప్ ఐకాన్, హాలీవుడ్ నటి అరియానా గ్రాండే చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. భావోద్వేగాలను దాచుకోవడం కాదు, వాటిని సంపూర్ణంగా అనుభవించడమే జీవితం అని ఆమె చెబుతున్నారు.

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో అరియానా గ్రాండే మాట్లాడుతూ, నేటి సమాజంలో ఆనందాన్ని వ్యక్తపరచడం పట్ల ఉన్న ప్రతికూలతపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "ఈ 'క్రింజ్' అనే పదం చాలా అన్యాయమైనది. నేను దేనినైనా గాఢంగా ప్రేమిస్తాను, ప్రత...