భారతదేశం, డిసెంబర్ 20 -- తెలుగు నెలల్లో పుష్యమాసం పదవ మాసంగా పరిగణించబడుతుంది. పుష్యమాసంలో శని దేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. శివుడికి కార్తీక మాసం, విష్ణువుకు మార్గశిర మాసం ఎలా ఉంటాయో, అలాగే శని దేవుడికి పుష్యమాసం అంత ప్రీతికరమైనది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో సంచరించే నెలను పుష్య మాసం అని అంటారు. పుష్య మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు, వ్రతాలు జరుపుకుంటారు. పైగా పుష్య మాసంలోనే సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మకర రాశికి అధిపతి శని కావడం వల్ల పుష్య మాసం అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం.

ఈ ఏడాది పుష్య మాసం డిసెంబర్ 20, అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. జనవరి 18తో పుష్యమాసం ముగుస్తుంది. శని భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో శనీశ్వరుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. శని న్యాయదేవుడు. ...