భారతదేశం, ఫిబ్రవరి 27 -- గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా సుమారు ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాలో ఆమె నటిస్తున్నవిషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ ఈ సినిమా విశేషాలను అంతర్జాతీయ టాక్ షో 'ది టునైట్ షో'లో పంచుకుంది.

ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ టాక్ షో 'ది టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్'లో పాల్గొన్న ఆమె.. తన తదుపరి ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతూ, ఈ సినిమా ఒక అద్భుతమైన అడ్వెంచర్ అని అనడం విశేషం.

చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాలో నటిస్తుండటంపై ప్రియాంక ఎంతో ఉత్సాహంగా ఉంది. షోలో హోస్ట్...