భారతదేశం, మార్చి 26 -- గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తాజాగా ఇండియాలో మళ్లీ ల్యాండ్ అయింది. ఇటలీలో జరిగిన బివిల్గారి ఈవెంట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. శాటిన్ సిల్వర్ షర్ట్, బ్లూ జీన్స్‌తో చాలా క్యాజువల్ లుక్‌లో కనిపించిన ప్రియాంకను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. విమానాశ్రయం వద్ద ఫోటోగ్రాఫర్లకు అభివాదం చేస్తూ, అభిమానులతో ఓపికగా సెల్ఫీలు దిగింది ప్రియాంక చోప్రా.

ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పంచుకుంది. అమృత్‌సర్‌కు ప్రయాణిస్తున్న మ్యాప్‌ను పోస్ట్ చేస్తూ.. "చలో, మరో అడ్వెంచర్ (సాహసం)" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

అయితే ఈ ప్రయాణం కేవలం పర్సనల్ ట్రిప్పా లేక ఏదైనా సినిమా షూటింగ్ కోసమా అనేది ఆమె వెల్లడించలేదు. ప్రియాంక చే...