భారతదేశం, అక్టోబర్ 6 -- Prime Video Trending: అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఓటీటీ స్మార్ట్ స్క్రీన్లపై ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు టాప్ ట్రెండింగ్ చార్ట్‌లను పూర్తిగా షేక్ చేస్తున్నాయి. స్పై థ్రిల్లర్స్, క్రైమ్ సస్పెన్స్, అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాలతో ఈ వారం ఓటీటీ లవర్స్ వీకెండ్ వాచ్‌లిస్ట్‌ను ప్రైమ్ వీడియో కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది.

తమిళ స్టార్ హీరో కార్తి డ్యూయల్ రోల్‌లో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' ప్రైమ్ వీడియోలో నంబర్ 1 పొజిషన్‌ను కైవసం చేసుకుంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్‌లో కార్తి యాక్షన్ సీన్స్, సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రైమ్ ఆడియన్స్‌ను విపరీతంగా కట్టిపడేస్తున్నాయి. ఇంట...