భారతదేశం, అక్టోబర్ 17 -- Preity Mukhundhan: కోలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ధనుష్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం అంటే ఏ హీరోయిన్‌కైనా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. అలాంటి క్రేజీ ఛాన్స్‌ను కొట్టేసింది లేటెస్ట్ సెన్సేషన్ ప్రీతి ముకుందన్. ధనుష్ కెరీర్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక 56వ చిత్రం (D56) లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

ధనుష్ సినిమాలో తనకు అవకాశం రావడంపై తాజాగా ప్రీతి ముకుందన్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఛాన్స్ రావడంపై ప్రీతి ముకుందన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

"సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లయినప్పటికీ, కొత్త సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల కోసం ఆడిషన్స్ ఇవ్వడం అనేది చాలా కామన్. ఆ పాత్రకు మనం సెట్ అవుతామా లేదా ...