భారతదేశం, మే 14 -- Prasanth Varma: 'హనుమాన్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU)ను శరవేగంగా విస్తరిస్తున్నారు. ఈ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'మహాకాళి'లో యువ నటుడు రోహిత్ సరాఫ్ చేరారు. ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్‌తో మెప్పించిన రోహిత్.. ఈ సినిమాతో పూర్తి భిన్నమైన రోల్‌లో కనిపించబోతున్నారు.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మిస్‌మ్యాచ్డ్' (Mismatched) ద్వారా యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రోహిత్ సరాఫ్.. ఇప్పటికే 'మహాకాళి' చిత్రానికి సంబంధించిన ఒక భారీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకురాలు పూజా అపర్ణ కొల్లూరు సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. "మహాకాళి ప్రపంచంలోకి రోహిత్ సరాఫ్‌కు స్వాగతం.. ఈ సినిమాతో థియేటర్ల...