భారతదేశం, ఫిబ్రవరి 27 -- టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వివేక్ ఒబేరాయ్ ఫస్ట్ లుక్ విడుదలవగా, ఆ పోస్ట్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు లేకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూర్చుతోంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ 'స్పిరిట్'. శుక్రవారం (ఫిబ్రవరి 27) నాడు ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ క్యారెక్టర్ పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో సినిమాలో నటిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ ట్యాగ్ చేశారు.

అయితే గతంలో ఈ ...