భారతదేశం, ఏప్రిల్ 17 -- Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపాడు. శ్రీరాముడు, రావణుడు, రామాయణంపై అతడు చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజపు మనోభావాలను దెబ్బతీశాయని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా దేశంలో జరుగుతున్న పరిణామాలను 'నరమేధం' (Genocide) తో పోల్చడం ఇప్పుడు అతన్ని న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టింది.

ఇటీవల ఒక మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. రామాయణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. "శ్రీరాముడు ఉత్తర భారతీయుడు.. రావణుడు దక్షిణ భారతానికి చెందిన గిరిజనుడు" అని అతడు పేర్కొన్నాడు. అంతేకాకుండా వారి మధ్య ఘర్షణ సీతమ్మ అపహరణ వల్ల కాదు, రాముడు పండ్లను దొంగిలించడం వల్ల ప్రారంభమైందని అతడు కామెంట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని, భగవంతుడైన శ్ర...